రాజకీయాల లబ్ధి కోసమే బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం నగరంలోని భస్వా గార్డెన్స్ లో జిల్లా యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్ర ఓటర్ నమోదు కార్యక్రమం లో భాగంగా వారు పాల్గొని ప్రసంగించారు.
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరితో ఓటర్ నమోదు చేయించాలని, అబాద్యత ప్రతి ఒక్కరి పై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
