HomePOLITICAL NEWSUncategorizedఆర్టీసీ మహిళ ప్రయాణికులకు బహుమతులు...

ఆర్టీసీ మహిళ ప్రయాణికులకు బహుమతులు…

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు నిజామాబాద్ ఆర్టీసీ అధికారులు బహుమతులు అందజేశారు.

టీజీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు నిజామాబాద్ వరంగల్ మార్గంలో మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన డీలక్స్ బస్సులో ప్రయాణించే మహిళల ప్రయాణికులకు ప్రతి 15 రోజులకు ఒకసారి గిఫ్ట్ బాక్స్ నుంచి లక్కీ డ్రా తీసి ముగ్గురు మహిళలకు బహుమతులు అందజేశారు.

ఇందులో పెర్కిట్ కు చెందిన టీ. వీనరాణి, అలాగే నిజామాబాద్ కు చెందిన నిర్మల,హుజూరాబాద్ కు చెందిన సంగా లక్ష్మి లు విజేతలుగా నిలిచారు.అదే విధముగా 01.10.2024 నుండి 15.10.2024 మద్య కాలంలో నిజామాబాద్ నుండి వరంగల్ రూట్లో ప్రయాణం చేసిన ముగ్గురు మహిళా ప్రయాణికులను డ్రా ద్వారా ఎన్నుకోవడం జరిగినది.

జగిత్యాల్ కు చెందిన G.లక్ష్మి, కరీంనగర్ కు చెందిన మంజుల,నిజాంసాగర్ కు చెందిన విజయ లక్ష్మి లు విజేతలుగా నిలిచారు.వీరికి బహుమతులు అందజేయడం జరుగుతుందనీ డిపో మేనేజర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments