కెమెరాలతోనే నేరాల నియంత్రణ నిజామాబాద్ సీపీ సాయి చైతన్యఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసు సిబ్బందితో సమానం అని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.
మన ఊరు – మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా ప్రజలే బాధ్యతగా ముందుకొచ్చి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
బుధవారం వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో ఏర్పాటు చేసిన 31 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… అనుమానాస్పద కదలికలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టడానికి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఇవి ఎంతో దోహదపడతాయి” అని వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ భద్రతను బాధ్యతగా భావించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు.గ్రామాల్లో డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పంచాయతీలను, ప్రజాప్రతినిధులను, దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్ఐ వంశీకృష్ణ, కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్, రుద్రూర్ ఎస్ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకోర సర్పంచ్ బి.పెద్ద సాయిలు, మాదాల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుబ్బారావు, ఠాకూర్, రిటైర్డ్ సైంటిస్ట్ తోట చేతన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కె.సురేష్ బాబు, ఉపసర్పంచ్ దస్తగిరి, బాలవికాస్ ట్రస్ట్ సభ్యులు చంద రాములు, బాలయ్య, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
