HomeCRIMEటీసీ కోసం వెళ్లిన విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం..

టీసీ కోసం వెళ్లిన విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అఘాయిత్యం..

పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ విద్యార్థిని పై లైంగిక దాడికి పాల్పడగా, ఆ విద్యార్థిని ధైర్యంగా ఎదురుదాడి చేసి తనను తాను కాపాడుకున్న ఘటన కొల్లాపూర్‌లో చోటుచేసుకుంది. తన ప్రైవేట్ పార్టుపై విద్యార్థిని తీవ్రంగా గాయపరచడంతో సదరు ప్రిన్సిపల్‌ నగ్నంగా పారిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. 2025లో పీజీ పూర్తి చేసిన ఓ విద్యార్థిని, తన టీసీ కోసం కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్‌ను ఆశ్రయించింది. అందుకు ఆయన, “టీసీ కావాలంటే నా ఇంటికి రా, అక్కడే ఇస్తాను” అని నమ్మబలికాడు. ప్రిన్సిపల్‌ మాటలను నమ్మిన బాధితురాలు, తన స్నేహితురాలితో కలిసి ఆయన ఇంటికి వెళ్లింది.

అక్కడికి వెళ్లగానే అసలు స్వరూపం బయటపెట్టిన ప్రిన్సిపల్, వారిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలిని గదిలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో తీవ్రంగా ప్రతిఘటించిన విద్యార్థిని, ప్రాణసంకట స్థితిలో ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికేసింది. తీవ్ర రక్తస్రావంతో, భయపడిన ప్రిన్సిపల్ నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు.

ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థిని వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణాన్ని వివరించింది. ప్రిన్సిపల్‌ అరాచకంపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కొల్లాపూర్‌ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments