HomeTelanganaNizamabadరగులుతున్న గడుగు ....ప్రాధాన్యత లేని పదవీ కట్టబెట్టడం పై కి నుకు ...స్టేట్ ఛైర్మెన్ ఇస్తారని...

రగులుతున్న గడుగు ….ప్రాధాన్యత లేని పదవీ కట్టబెట్టడం పై కి నుకు …స్టేట్ ఛైర్మెన్ ఇస్తారని ఆశించిన వైనం

పదవులు కేటాయింపులో పార్టీ పెద్దల వైఖరి తో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ రగిలి పోతున్నారు. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్ నేతగా ఉన్న తనకు ఎదో ఒక స్టేట్ ఛైర్మెన్ ఇస్తారని భావించిన గడుగు కు ఏ మాత్రం ప్రాధాన్యత లేని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది.

తన సీనియార్టీ తగ్గ పదవీ కట్టబెడుతారని భావించిన తనకు ఆరుగురు సభ్యులున్న కమిషన్ లో ఓ సభ్యుడిగా నియమించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి కి గురైనట్లు సమాచారం ఆయన ఈ పదవీ తీసుకోవడానికి ససేమిరా అంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

రెండు రోజులుగా జిల్లాలోనే పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం గడుగు ను బుజ్జగించారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జుక్కల్ సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించారు.

గత కొన్నేళ్లుగా ఆయన అక్కడే మకాం వేసి స్థానికంగా క్యాడర్ లో పట్టు సాధించారు అనేక ప్రజా సమస్యల మీద గొంతెత్తారు కానీ టికెట్ రాక పోవడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి భరోసా తో ఎన్నికల్లో అర్బన్ బోధన్ సెగ్మెంట్ లలో విస్తృతంగా ప్రచారం చేశారు.

పార్టీ అధికారంలోకి రావడంతో ఎదో స్టేట్ ఛైర్మెన్ కచ్చితంగా వస్తుందనే ధీమాతో వుంటూ వచ్చారు. ఈ మేరకు సుదర్శన్ రెడ్డి సైతం అదే హామీ ఇచ్చారు అనేక పర్యాయాలు సైతం నేరుగా సీఎం రేవంత్ వద్ద గడుగు పోస్టు కోసం ప్రస్తావించారు.

అయితే మొదటి దఫాలోనే ఆయనకు జిల్లా నుంచి నామినేటెడ్ పదవీ వస్తుందని భావించారు తాహెర్, అన్వేష్ రెడ్డి ,అనిల్ ఇరవత్రి ,మానాల మోహన్ రెడ్డి లాంటి నేతలకు స్టేట్ ఛైర్మెన్ పదవులు దక్కాయి. కానీగడుగు కు మాత్రం నిరాశ ఎదురైంది.

యన్ యస్ యూ ఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన గడుగు పార్టీలోనే క్రియాశీల పదవులు దక్కాయి. దాదాపు పదేళ్ల పాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన గడుగు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ విజయ దుంధిబి మోగించేలా కార్యాచరణ రూపొందించారు.

గతంలోనే ఆయన ను యస్సి కమిషన్ చైర్మెన్ నియామకం కుఅప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిల్లాకు చెందిన దిగ్గజ నేతల ఆధిపత్య పోరు లో ఆయన నియామకం ఆగిపోయింది. తీవ్ర నిరాశకు గురైన ఆయన ఓ దశలో పార్టీ వీడుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది.

బిఆర్ యస్ లో చేరాలని ఒత్తిడి వచ్చింది కానీ ససేమిరా అన్నారు. కార్పొరేటర్ గా ఉన్న తనయుడి తో కలసి కాంగ్రెస్ లోనే కొనసాగారు బిఆర్ యస్ పాలన మీద దండెత్తారు చివరికి కొడుకు రోహిత్ మీద రౌడీ షిట్ కూడా ఓపెన్ అయింది.

కేవలం కెసిఆర్, కేటీఆర్ కాన్వాయి లను అడ్డుకుందుకే అప్పటి బిఆర్ యస్ నేతలు తనయుడు మీద కత్తి కట్టి వెంటాడారు.అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పార్టీలో కీలక నేతగా ఉన్న గడుగు కు ఈసారి కీలక పదవీ దక్కుతుందని అంతా భావించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments