ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోళ్ల చేయకపోవడంతో రైతులు వడ్ల ను రోడ్ల మీదే అర బోస్తున్నారు. అదే వడ్ల కుప్ప కొడుకు ను మృత్యుఒడి కి చేర్చితే తండ్రి కొనఊపిరి కి చేర్చింది.
ఈ విషాద ఉదంతం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పెట్ మండలం బొల్లారం లో జరిగింది. గ్రామానికి చెందిన వెంకట్ ( 25 ) తండ్రి నాగభూషణం తో కలసి మంళవారం సాయంత్రం గ్రామశివారు లోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళాడు .
అర బెట్టిన వడ్ల ను కుప్పచేయడానికి సిద్ధం అయ్యాడు కానీ ఒక్కసారి వర్షం కుండా పోతగా వచ్చింది. దీనితో అక్కడే ఉన్న వేప చెట్టుకిందికి తండ్రి తోపాటు వెంకట్ వెళ్ళాడు.
భారీ ఉరుములతో పాటు ఒక్కసారిగా పిడుగు అదే వేప చెట్టుమీద పడింది దీనితో వెంకట్ అక్కడిక్కడే మృత్యువాత పడగ తండ్రి నాగభూషణం కు ప్రాణాపాయం తప్పినా తీవ్రగాయాలు అయ్యాయి.
అక్కడే ధాన్యం ఎత్తడానికి వచ్చిన మరో ముగ్గురికి సైతం గాయాలు అయ్యాయి. వడ్ల అర బెట్టడానికి వెళ్లి వెంకట్ మృత్యువాత పడిన ఘటన గ్రామస్తులను కలిచి వేసింది
