HomeTelanganaNizamabadస్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్...

స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్…

నిజామాబాద్ జిల్లాలోనీ ఎడపల్లి పీఎస్ పరిధిలోని జాన్కంపేటలో గల పోలీస్ శిక్షణ కేంద్రంలో స్టైఫండరీ కేడెట్ ట్రెయినీ కానిస్టేబుళ్లకు స్పోర్ట్స్ మీట్ ను జిల్లా ఇన్చార్జి కమిషనర్ సిందూశర్మ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులకు విధి నిర్వహణతో పాటు క్రీడలూ అవసరమేనని అన్నారు.మనం అందరం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుందనీ, మనకు ఎన్నో రకాల వస్తాయని వాటి నుండి మన శ్యాంతి పొందాలంటే క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

క్రీడల కోసం ప్రతి ఒక్కరు కొంత సమయం కేటాయించాలని, ఇక్కడ శిక్షణ పొందుతున్న సిబ్బందిలో ఎంతో మంది మంచి క్రీడాకారులు ఉన్నారని, వారు ఇంకా మంచి నైపుణ్యతగావించి జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం కృషి చేయాలని ట్రైనింగ్ కానిస్టేబుల్ లకు సూచించారు.

పోలీస్ వృత్తి అనేది ఒక టీమ్ వర్క్ గా విధులు నిర్వహించాల్సి వస్తుందని, ఈ టీమ్ వర్క్ అనేది ముఖ్యంగా ఈ క్రీడల వలన వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో .టి.సి ప్రిన్సిపాల్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్) శ్రీ బి.కోటేశ్వర రావు,అదనపు డి.సి.పి ( ఎల్ అండ్ ఓ )జి. బస్వారెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పి ఎస్. శ్రీనివాస్ రావ్, ఎ.ఆర్ ఎ.సి.పి నాగయ్య, బోధన్ ఎ.సి.పి పి. శ్రీనివాస్, సి.ఐ శివరాం, ఆర్.శ్రీపాల్, రిజర్వు ఇన్స్పెక్టర్, ఆర్.ఎస్.ఐ లు క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments