ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం పై ఉన్న శ్రద్ధ జిల్లా అభివృద్ధి పై దృష్టి లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ ఎద్దేవ చేశారు.
మంగళవారం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ లో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయని,అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినాయని ఇందిరమ్మ ఇండ్లు దేవుడు ఎరుగు కనీసం కట్టిన ఇళ్ళైన బాగు చేసి అర్హులైన వారికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
లేని పక్షాన అర్హులైన వారందరితో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం అని హెచ్చరించారు.పొంగులేటి మాటలు పాల మీద పొంగులాగే ఉన్నాయని ఏద్దేవా చేసారు.
కొద్ది రోజుల కింద నిజామాబాదు వచ్చి దసరా లోపు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అన్నారు, ఇప్పుడు నెల ఆఖారికి 3500 నుండి 4 వేలు ఇస్తాము అంటున్నారని, వచ్చే నెల డిసెంబర్ 9 సోనియామ్మ జన్మదిననికి అంటారేమో అని ఏద్దేవా చేసారు.
రైతన్నలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అని, రైతు భరోసా గ్యారంటీ కింద రైతులకు, రైతు కూలీలకు 15వేలు, 12 వేలు అని పంట బోనస్ అని అన్ని బోగస్ మాటలు చెప్పి ఇప్పటికి వాటి ఊసే లేదని విమర్శించారు.
గత ప్రభుత్వం మాదిరి మాయ మాటలు, కళ్ళబోల్లి కబుర్లు చెప్పి కాలం గడుపుతాం అంటే సాహించేది లేదని హెచ్చరించారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని 10 ఏళ్ళు యావత్ తెలంగాణ ప్రజలని బిఆర్ఎస్ ప్రభుత్యం మోసం చేసిందని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.
