పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బాధ్యతల్లో వుండగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వ్యూలు బుట్టదాఖలు అవుతున్నాయి. బదిలీ అయిన వారిలో కొందరు కానిస్టేబుళ్ల ను రిలీవ్ కావడానికి ససేమిరా అంటున్నారు.ముఖ్యంగా కొందరు కోర్టు కానిస్టేబుళ్లు గతంలో ఎప్పుడు లేని విధంగా బదిలీ లపై దిక్కార ధోరణి అవలంబిస్తుండడం పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది..
ఈ వ్యవహారంలో ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. కానిస్టేబుళ్ల ధిక్కార స్వరం వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశం అయింది. కల్మేశ్వర్ నిజామాబాద్ కమిషనర్ గా పనిచేసిన కాలం లో ఆయన అనుమతి లేకుండా కనీసం ఏసీపీ స్థాయి అధికారి కూడా జిల్లాలో ఎంట్రీ అవ్వకుండా కట్టడి చేసారు.
ఆయన ఆదేశాలను ధిక్కరించే వారికి ఎలాంటి చుక్కలు చూపెట్టాడో అందరూ చూసారు. ఆయన బదిలీ కావడానికి కొద్దిరోజుల ముందు కమిషనరేట్ పరిధి లో ఏ ఎస్సై ,హెడ్ కానిస్టేబుల్.కానిస్టేబుళ్ల బదిలీ లు చేశారు.
ఈ వ్యవహారంలో ఆయన స్పెషల్ బ్రాంచ్ ఇంటలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఈ బదిలీ లు అదికూడా చడీచప్పుడు లేకుండా ఏకంగా 78 మంది కానిస్టేబుళ్ల ను బదిలీ చేసారు. ఇందులో కోర్టు విధుల్లో ఉండే కానిస్టేబుళ్ల ను మూకుమ్మడిగా బదిలీ చేయడం వారికి ఏ మాత్రం మింగుడు పడలేదు.
ఎంతో నెట్ వర్క్ ఉన్న తాము ఎలా బదిలీ చేస్తరనే ధిక్కార స్వరం వారి నుంచి వ్యక్తం అయింది.కానీ అక్కడుంది కల్మేశ్వర్ కదా. సౌండ్ బయటికి రానివ్వలేదు.
ఏ ఎస్సై లు హెడ్ కానిస్టేబుళ్లు తో పాటు 50 మంది కానిస్టేబుళ్లు మూడు రోజుల్లోనే బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. కానీ కోర్టు విధుల్లో ఉన్న వారికి మాత్రం కమిషనర్ అయిదు రోజుల గడువు ఇచ్చారు. ఈలోపు కమిషనర్ బదిలీ అయ్యారు.
హమ్మయ్య అంటూ కోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఊపిరి పీల్చుకున్నారు. పేరుకే కోర్టు కానిస్టేబుళ్లే అయినా అందులో కొందరు ఘనాపాటి లున్నారు బదిలీ ఉత్తర్వ్యూలు ఇచ్చిన కల్మేశ్వర్ ఎలాగో లేరు ఇంకేముంది రిలీవ్ కావడానికి ససేమిరా అన్నారు అసలు వారిని రిలీవ్ కావాలని అడిగేనాథులే లేకుండా పోయారు.
ఆయా స్టేషన్ ల అధికారులకు ఇదివరకే బదిలీ మెమో లు వెళ్లాయి .కానీ ఏ ఒక్క స్టేషన్ ఆఫీసర్ కూడా కోర్టు కానిస్టేబుళ్ల ను రిలీవ్ కావాలని ఒత్తిడి చేయలేని పరిస్థితి. ఎందుకంటే కోర్టు కానిస్టేబుళ్ల తో వారికి కూడా బలమైన ఆర్థికబంధాలు ఉంటాయి.
అయితే దాదాపు ముప్పై మంది వరకు కానిస్టేబుళ్లు రిలీవ్ కాక పోవడం పోలీస్ శాఖ లో అసాధారణ ఘటన గాచెప్తున్నారు. వీరు రిలీవ్ కాకుండా ఎందుకు ధిక్కారధోరణి తో ఉన్నారనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.
కమిషనర్ బదిలీ అయ్యారు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కు ఇంచార్జి గా ఇచ్చారు ఆమె ఇక్కడి పాలనా వ్యవహారాలను పూర్తీ స్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి ఉండదనే ధీమాతో బదిలీ ఉత్తర్వ్యూలను బుట్టదాఖలు చేసారు.
అయితే కమిషనరేట్ కార్యాలయంలో ఉండే ఓ కీలక అధికారి సైతం వీరికి భరోసా ఉన్నారనే చర్చ మాత్రం ఉంది.
