ఆన్ లైన్ లో పరిచయం చేసుకున్న వ్యక్తి పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడి మీద ఫోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని తారకరామా నగర్ కు చెందిన ఓ మైనర్ అమ్మాయి కి ఆంద్ర ప్రాంతానికి చెందిన ఓ యువకుడి తో స్నాప్ చాట్ లో పరిచయమయింది. స్నేహం ఇద్దరి మధ్యప్రేమ గా మారింది.
అయితే యువకుడు పెండ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో ఈనెల 19 నాడు అమ్మాయి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా హైదారాబాద్ వెళ్ళిపోయింది. ఆమె రిసీవ్ చేసుకున్న యువకుడు తన స్నేహితుడి రూమ్ కు తీసుకెళ్లి ఇక్కడే ఉండమని చెప్పి తన తల్లిదండ్రులు పెండ్లి అంగీకరించారని బుకాయించి ముఖ్యమైన పని వుందని వెళ్లి అడ్రస్ లేకుండా పోతాడు.
ఇంట్లో నుంచి తమ కూతరు వెళ్లి పోయిన విషయం అమ్మాయి తలిదండ్రులుపిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి అమ్మాయి హైదారాబాద్ ఉన్నట్లు గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకోని విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది నిందితుడి శీను నాయుడును అదుపు లోకి తీసుకొని రిమాండ్ కు పంపారు
