Thursday, April 30, 2026
HomePOLITICAL NEWSUncategorizedరైలు కింద పడి మహిళ ఆత్మ హత్య...

రైలు కింద పడి మహిళ ఆత్మ హత్య…

రైలు కింద పడి మహిళ ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని ఆర్సపల్లీ కి చెందిన అసది సుజాత(38). ఆర్సపల్లీ కి చెందిన రవితో 14 సంవత్సర క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.గత కొన్ని రోజులుగా తరుచూ భర్తతో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.

అలాగే మంగళవారం కూడా పక్కింటి వారితో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా బుదవారం నగరంలోని ఆర్సపల్లీ రైల్వే గేటు దాటిన తర్వాత గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!