Thursday, April 30, 2026
HomeCRIMEనో ....!కొత్వాల్ .....నో ...!టాస్క్ ఫోర్స్ .....ఆడుకున్నోళ్లకు ఆడుకున్నంత ......పండగ జూదం ఫై ఆశలు

నో ….!కొత్వాల్ …..నో …!టాస్క్ ఫోర్స్ …..ఆడుకున్నోళ్లకు ఆడుకున్నంత ……పండగ జూదం ఫై ఆశలు

గత కొన్నేళ్లుగా కట్టడి లో ఉన్న దీపావళి పండగ జూదం జాడ్యం మళ్ళీ ఈసారి జడలు విప్పింది. పోలీసు శాఖ పండగ జూదం మీద ఎప్పటిలాగే కఠిన కార్యాచరణ తో ఉక్కుపాదం మోపే నాధుడే లేకుండా పోయారు.

పోలీసు కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడం కాదు ….టాస్క్ ఫోర్స్ సైతం అడ్రస్ లేకుండా పోయింది. ఇంకేముంది ఆడుకున్నోళ్లకు ఆడుకున్నంత అన్నట్లుగా మారింది. కట్టడి చేయాల్సిన స్థానిక పోలీసులు సైతం లైట్ తీసుకుంటున్నారు.

అందుకే జిల్లాలో పండగ కు ఒక్క రోజు ముందే ఆయా ప్రాంతాల్లో జూదం అద్దాలు వెలిసాయి.కమిషనర్ గా పనిచేసిన కల్మేశ్వర్ జిల్లాలో జూదం అడ్డాల మీద విరుచుక పడ్డారు.

స్టార్ హోటళ్లు ప్రముఖులుఆడే అడ్డాల చివరికి లేడీస్ అడ్డాలఫై సైతంపంజా విసిరారు. ఆర్మూర్ ప్రాంతంలో పంట పొలాల్లో గుట్టుగా సాగుతున్న అనేక జూదం అడ్డాల గుట్టు ను రట్టుచేశారు.

టాస్క్ ఫోర్స్ యంత్రాంగం ను ఇదే కార్యాచరణ కోసం గట్టిగా పురమాయించారు. ఓ దశలో జూదం అడ్డాల నిర్వహణే ఓ వ్యాపారం లా చేసుకుంటున్న వారు భారీ నజరానా లతో టాస్క్ ఫోర్స్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ అడపా దడపా అద్దాలు మార్చేస్తూ జూదం దందా సాగిస్తూ వచ్చారు.

చివరి అదికూడా కల్మేశ్వర్ చెవికి చేరడంతో అప్రమత్తం అయ్యారు టాస్క్ ఫోర్స్ ను పక్కుకు పెట్టి . సీసీఎస్ ను రంగంలోకి దించారు. జూదం అడ్డాల నుంచి ముడుపులు మెక్కిన టాస్క్ ఫోర్స్ అధికారులను గుర్తించారు వారికి చేయాల్సిన శాస్రి చేసారు. ఆ విభాగంను పూర్తిగా ప్రక్షాళన చేశారు.

సమర్థులతో పటిష్టం చేసే క్రమంలోనే ఆయన బదిలీ అయ్యారు.దీనితో టాస్క్ ఫోర్స్ విభాగం లో ఎవ్వరూ లేకుండ పోయారు ఆఫీస్ కు గత పది రోజులుగా తాళం వేసి వుంచుతున్నారు.

ఇంచార్జి గా కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ను నియమించారు. కానీ కామారెడ్డి వ్యవహారాల్లోనే బిజీగా ఉన్న ఆమె నిజామాబాద్ జిల్లా వ్యవహారాలఫై క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నారు.

జస్ట్ శాంతి భద్రతలనే ఆమె పర్యవేక్షిస్తున్నారు.ఇద్దరు అదనపు డీసీపీ లు అందుబాటు లో ఉన్నారు కానీ నేరుగా రంగంలోకి దిగలేక పోతున్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ బస్వా రెడ్డి సుదీర్ఘ కాలం జిల్లాలో పనిచేసారు.

కానీ బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన కఠిన చర్యలకు దిగలేక పోతున్నారు మరో వైపు ప్రభుత్వం కొత్త కమిషనర్ నియామకం లో ఇంకా మీన మేషాలు లెక్కిస్తుంది ఎలాగో డిఐజి పోస్టు ను దాదాపు ఆరేళ్లుగా ఖాళీ పెట్టిన ప్రబుత్వం కనీసం సీపీ పోస్టు భర్తీ లోను జాప్యం చేయడం తగదని చర్చ జరుగుతుంది.

కమిషనర్ ఎలాగో లేరు టాస్క్ ఫోర్స్ కార్యాలయం కు ఏకంగా తాళం వేసి వుండడంతో ఈసారి పండగ జూదం మరోసారి జాడలు విప్పే పరిస్థితి ఉంది ఆయా ప్రాంతాల్లో పండగ జూదం కోసం స్పెషల్ అడ్డాలు అందుబాటులో కి తేవడానికి రంగం సిద్ధం అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!