Friday, April 24, 2026
HomeCRIMEయథేచ్ఛగా సాగిన పండగ జూదం .......పట్టణాలను వదిలి పల్లెల్లో పాగా .......అటవీ ప్రాంతాలకు జూదం...

యథేచ్ఛగా సాగిన పండగ జూదం …….పట్టణాలను వదిలి పల్లెల్లో పాగా …….అటవీ ప్రాంతాలకు జూదం కళ ……చేతులెత్తేసిన యంత్రాంగం

ప్రత్యేక బృందాలతో …పటిష్టమైన కార్యచరణతో రంగంలోకి దిగి ఎప్పటికప్పడు దాడులతో బెంబేలెత్తిస్తినే అంతంత మాత్రంగా సాగిన దీపావళి పండగ జూదం ఈ ఏడాది జెడలు విప్పింది. ఇదివరకు గుట్టుగా సాగిన అట ఈసారి యధేచ్చం అయింది.కమిషనర్ ఎలాగో లేరు టాస్క్ ఫోర్స్ ఉనికే లేకుండా పోయింది.

అందుకే జూదగాళ్ళ కు పట్టపగ్గాలే లేకుండా పోయాయి. కానీ ఈసారి మాయదారి ఆట పట్టణాలను వదిలి పల్లెకు వచ్చి పాగా వేసింది. గ్రామానికి పంట పొలాల అటవీ ప్రాంతాల్లోనే పండగ జూదం అద్దాలు వెలిసాయి.

ఎలాగో రైడ్ చేసేది స్థానిక పోలీసులే కదా ఖచ్చితంగా ముందే సమాచారం వచ్చేలా ప్లాన్ వేసుకున్నారు నిర్వాహకులు.! ఈసారి గ్రామీణ ప్రాంతాలు పండగ జూదం కళకళ లడాయి. గతంలో పండగ వేల జూదం అడే విష సంస్కృతీ పట్టణ, నగర ప్రాంతాల్లోనే విచ్చల విడిగా వుండేది.

ఒక్కరోజులోనే కోట్ల రూపాయల టర్నోవర్ సాగేది. కానీ దశాబ్ద కాలంగా పోలీసు శాఖకట్టడి చేస్తు వచ్చింది. నిజామాబాద్ బోధన్ కామారెడ్డి ఆర్మూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో పండగ నాడు లక్ష్మి పూజల తర్వాత కాసేపు కాలక్షేపం కోసం జూదం ఆడడం ఆనవాయితీ గా ఉన్నవారు గుట్టుగా ఆడేసి వెళ్లారు.

ఈసారి కమిషనర్ లేకపోవడంతో జూదంప్రియులకు కలిసి వచ్చినట్లు అయింది.జూదం అడ్డాలునడిపే వారు ఈసారి అడ్డాలను గ్రామీణ ప్రాంతాలకు మార్చేశారు.సకల సౌకర్యాలతో గ్రామంలోనే జూదం కేంద్రాలను దీపావళి పండగ కోసం అందుబాటులోకి తెచ్చారు.

క్యాసినో లకు పీఆర్వో లుగా ఉన్న ఒకరిద్దరు కానిస్టేబుళ్లు పండగ జూదం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా పంట పొలాల్లో పక్కగా ఏర్పట్లు చేసారు. వేల్పూర్ మండలం ఓ మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలో రాత్రి జూదం జాతర సాగింది నిజామాబాద్ నగరం నుంచి నలుగురు ముగ్గురు డాక్టర్లు ఓ రైస్ మిల్ యజమాని వెళ్లారు.

నందిపేట్ మండలం లో గోదావరి ఒడ్డున ఉండే వ్యవసాయం క్షేత్రంలో కూడా గత రాత్రి జూదం యథేచ్ఛగా సాగింది . జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మోపాల్ మండలంలో ఉండే ఓ గ్రామంలో అధికార పార్టీ కి చెందిన ఇద్దరు కీలక నేతలు సందడి చేసారు.

ఇదే స్టేషన్ పరిధి లో మరో మేజర్ గ్రామం లో రాత్రి ఓ అడ్డాలో జూదం జాతర జరిగింది. ఇక్కడికే నగరంలోని మెడికల్ ఏజెన్సీ ఓనర్లు హడావుడి చేసారు.

పండగ జూదం విషయంలో కఠినంగా వుండాలని దిశానిర్దేశం చేసే వారు లేకపోవడంతో స్థానిక పోలీసులు సైతం జూదం అడ్డాల వైపు కన్నెత్తి చూడలేక పోయారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!