HomeTelanganaNizamabadఇందిరమ్మ కమిటీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఇందిరమ్మ కమిటీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఇళ్ళు పంచాలని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గత BRS పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను మోసం చేసి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు తెర తెలిపిందని అన్నారు.

ప్రజలు మార్పు కావాలని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్కటి కూడా దిక్కు లేదని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో నిజమైన అర్హులైన వారికీ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఇళ్ళు పంచె కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరాలేపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

తెలంగాణలో పేదోని సొంతింటి కల కలగానే మిగిలేలా చేస్తా అంటే చూస్తూ ఊరుకోమని నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీ పేరుతో కాంగ్రెస్ నాయకుల,కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని BRS పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతది అని హెచ్చరించారు.

అలాగే ఇందిరమ్మ ఇండ్ల జాబితా ప్రజాక్షేత్రంలో నిజమైన అర్హులను ఎంపిక చేయాలని నియోజకవర్గనికి కాంగ్రెస్ ఇస్తానన్న 3500 ఇళ్లతో పాటు డబుల్ బెడ్ రూమ్ లను కూడా అర్హులైన వారికీ కేటాయించాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో అర్హులందరితో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments