పురుగుల మందు సేవించి బాలుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన సదశివ నగర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామానికి చెందిన భాను ప్రసాద్(12) ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కడుపునొప్పిగా ఉండడంతో స్కూల్ నుండి ఇంటికి వెళ్లిన భాను ప్రసాద్ ఇంట్లో దూలం పైన ఉన్న గడ్డి మందు ని మతిస్థిమితం లేకపోవడంతో కడుపునొప్పి తగ్గడానికి పనిచేస్తుంది అనుకోని తాగేసాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉట్నూర్ లోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు.దీనితో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
