జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాట రాయుళ్లు త మ జోరును కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్థావరాల్లో పేకాటను ఆడారు. పేకాటను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పేకాట జోరు తగ్గలేదు. దీపావళి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 116 కేసులు నమోదు చేస్తున్నట్లు ఇన్చార్జి సీపీ సింధుశర్మ పేర్కొన్నారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోనీ నిజామాబాద్,ఆర్మూర్,బోధన్ డివిజన్ లో మొత్తం 116 కేసులు నమోదు చేసి రూ.11,47,240 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్ లో మొత్తం53కేసులు, 267మంది నిపట్టుకొని వారినుంచి రూ.5,03,570 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే ఆర్మూర్ డివిజన్ లో మొత్తం 26 కేసులుకగా 138 మందిని పట్టుకొని వారినుంచి రూ.2,85,570 నగదు స్వాదీనం చేసుకున్నారు.అదేవిధంగా బోధన్ డివిజన్ లో మొత్తం 37 కేసులు చేసి 192 మందిని పట్టుకొని వారినుంచి రూ.3,58,100 నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు డివిజన్ లు కలిపి మొత్తం 116 కేసులు ,మొత్తం 597 మంది , రూ.11,47,240 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి సీపీ తెలిపారు.
