Friday, April 24, 2026
HomeCRIMEస్టేషన్ ఎదుటే ఒంటిమీద పెట్రోల్ పోసుకున్న యువకుడు

స్టేషన్ ఎదుటే ఒంటిమీద పెట్రోల్ పోసుకున్న యువకుడు

భార్య తో తెలెత్తిన గొడవలో పోలీసు స్టేషన్ కు వచ్చిన భర్త అక్కడే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన గురువారం బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. బెల్లాల్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకున్నాడు. రాజు అతని భార్య మధ్య వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.

రాజు భార్య సావిత్రి మధ్య గొడవలు తలెత్తడంతో ఆమె బంధువు వద్ద ఓ రోజు ఉంది. ఈ విషయం తెలిసిన రాజు బంధువుతో గొడవకు దిగాడు. రోడ్డు పై గొడవ వద్దని మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి పై రాజు దాడికి దిగాడు. అందరు పోలీస్ స్టేషన్ కు రావడంతో రాజు ఆగ్రహంతో పెట్రోల్ తెచ్చుకొని తలపై పోసుకోవడంతో పాటు అతని భార్య పై సైతం పెట్రోలు పోసి ఆత్మ హత్యకు ప్రయత్నించాడు. పోలీసులు రాజును అదుపు లోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!