రైస్ మిల్లులో పేకాట స్థావరంపై దాడి నిర్వహించి 10 మందిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, సీసీఎస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 10 మందిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వారి నుంచి రు 1,14,550 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
