నగరంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరి జరిగిన సంఘటన మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని న్యూ ఇన్జీవోస్ కాలనీకి చెందిన సముద్రాల ఏళ్ళేశ్వరావు అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 28 న పండగ సందర్భంగా ఖమ్మం కు వెళ్ళారు.
తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో నుంచి 23 తులాల బంగారం,8 తులాల వెండి అపహారించినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
