యదా లీడర్ .. తదా క్యాడర్ అన్నట్లుగా ఉంది బిఆర్ యస్ పార్టీ పరిస్థితి.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే లు తమ అధినేత కెసిఆర్ అనుసరిస్తున్న ధోరణి నే గుడ్డిగా పాలో అవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా మారారు. ద్వితీయ శ్రేణి నేతలతో ఆయా కార్యక్రమాలను మొక్కుబడిగా నెట్టుకొస్తున్నారు.
మాజీలు పదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేక పోతున్నారు అధినేత కెసిఆర్ అధికారం కోల్పోయాక ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేవలం పార్టీ ముఖ్యనేతలకే అపాయింట్ మెంట్ ఇస్తున్నారు.
సామాన్య ప్రజలను కలవడానికి సార్ ససేమిరా అంటున్నారు. అనేక విపత్తు లతో ప్రజానీకం అల్లాడుతున్నా సరే సార్ కనీసం పల్లెతు మాట అనని పరిస్థితి.లోకసభ ఎన్నికల ప్రచారం తర్వాత సార్ దర్శనం భాగ్యం మరింత క్లిష్టంగా మారింది అదిగో సార్ దిగుతున్నారు ఇదిగో వచ్చాస్తున్నారంటూ పార్టీ వర్గాల ఉత్తిత్తి గాయి గత్తర చేస్తున్నారు. కొత్త సర్కార్ కొలువు దీరి ఏడాది సమీపిస్తోంది.
ఆరు గ్యారెంటీ అమలు గాలికి వదిలేసిన రేవంత్ సర్కార్ అనేక సర్కస్ ఫీట్లు చేస్తుంది.అయిన సార్ నుంచి ఉలుకు పలుకు లేదు. ఫామ్ హౌస్ ను ధాటి ప్రజాక్షేత్రంలో కి రాలేక పోతున్నారు.సార్ దారి లోనే మాజీ ఎమ్మెల్యే నడుస్తున్నారు.
కెసిఆర్ ఫామ్ హౌస్ ధాటి రానట్లే మాజీ ఎమ్మెల్యే లు కూడా హైదారాబాద్ వీడి జిల్లాకు రాలేక పోతున్నారు. ఒక్క బాజీ రెడ్డి మినహా మిగితా మాజీ లందరూ హైదారాబాద్ లో మకాం వేసి ఉన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అయితే ఏకంగా దుబాయి నుంచే రాలేక పోతున్నారు.
పదేళ్ల పాటు నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేపథ్యంలో ఇప్పుడు అనామకులుగా నియోజకవర్గాల్లో తిరగడానికి మాజీ లకు మనుసు ఒప్పడం లేదు. కనీసం క్యాడర్ కు సైతం అందుబాటులో ఉండలేక పోతున్నారు.
కీలక నేతల ఇండ్లలో శుభకార్యాలు ….దుఃఖ ఘటన లకు సైతం ముఖం చాటేస్తున్నారు. ఒక్కో మాజీ ఎమ్మెల్యే ఏడాది కాలం జస్ట్ నాలుగయిదు మార్లె అదికూడా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. ఒక్కరోజులోనే పరామర్శ యాత్రలు చేసి వెళ్లిపోతున్నారు.
మాజీ ధోరణి వల్లే కింది స్థాయిలో క్రియాశీల నేతలు సైతం పార్టీ ని వదిలేసి అధికార పార్టీ లో చేరిపోయారు. అసలు వలసల విషయంలో కనీస శ్రద్ధ కూడా ఎత్తలేదట.
ఓ మాజీ ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీలోకి అఫర్ వుంటే వెళ్లాలని సన్నిహితులనే ఒత్తిడి చేసి పంపించాడని సమాచారం. అధికార పార్టీ లోనూ తమ హవా ఉండలనే ఎత్తుగడ తోనే వలస లైట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.
మళ్ళీ ఎన్నికల సమయంలో వారంతా తనవెనుక వచ్చేలా ఒప్పందం చేసుకొని మరో మాజీ వలస లను ప్రోత్సహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో క్రియాశీల నేతలే లేకుండా పోయారు.అందుకే ప్రజా ఆందోళన లు మొక్కుబడిగా మారాయి.
ఆయా కార్యక్రమాలు క్యాడర్ లేక తుస్సుమంటున్నాయి. ఇటీవల విద్యుతు సంబరాలు జిల్లా పార్టీ కార్యాలయం లో ఎదో మమా అనిపించారు. అన్నీ నియోజకవర్గాల్లో ధూమ్ ధాం గా చేయాలనేది పార్టీ ఇచ్చిన పిలుపు కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ ఏడాది కాలంగా దుబాయి కే పరిమితం అయ్యారు ఆయన సతీమణి ఆయెషా మొదట్లో కొంత క్యాడర్ తో మమేకం అయినప్పటికి కొద్దీ రోజులుగా ఆమె కూడా అందుబాటులోకి రావడం లేదు.
దీనితో గులాబీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరో మాజీ బిగాల సైతం ఇదివరకు లా అందుబాటు లో ఉండలేక పోతున్నారు. కీలక నేతలు అధికార పార్టీ లో కి వెళ్లిపోయారు. బాజిరెడ్డి నియోజకవర్గం లోనే వుంటున్నారు.
కానీ ఆయన ప్రజాక్షేత్రం లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపలేక పోతున్నారు కానీ క్యాడర్ తో మాత్రం మునుపటి లాగే టచ్ లో ఉన్నారు. మరో మాజీ జీవన్ రెడ్డి కెసిఆర్ కొటారి లో వుంటూ హైదారాబాద్ కే పరిమితం అయ్యారు.
జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు అయినప్పటికి ఆయన క్యాడర్ కు కనీసం సమయం ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి.ఓకే ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సైతం ఇదివరకు లాగ నియోజకవర్గంకు అడపా దడపా వచ్చి వెళ్తున్నారు.
ఎమ్మెల్యే గా ఆయన జిల్లా వ్యాప్తంగా క్యాడర్ అండగా వుంటూ ప్రజల పక్షనా గొంతెత్తాల్సింది.కానీ ఆయనా కెసిఆర్ చుట్టూ ప్రదక్షణాలకే పరిమితం అయ్యారు.
పార్టీ అధికారంలో వుండగా పదేళ్లు నియోజకవర్గాల్లో సమంత రాజులుగా చెలామణి అయిన వీరంతా మాజీ లుకావడంతో ప్రజాక్షేత్రంలోకి రావడానికి కనీస ఆసక్తి చూపడం లేదు
