నవంబర్ 6వ నుంచి మూడు వారాలపాటు ప్రభుత్వ పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది .
కుల గణన ఇంటింటి సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ బృహత్తర కార్యంను సక్సెస్ చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వ పంతుళ్ళను రంగంలోకి దింపింది. అందుకే పాఠశాలలను మధ్యాహ్నం వరకే నిర్వహించ నున్నారు.
ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో 80 వేల మంది సేవలను వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది.
ఇందులో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్లు ఉండబోతున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లలో దాదాపు సగం, అంటే 40వేల మంది టీచర్లే.
ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 6 నుంచి మూడు వారాల పాటు కుల గణన సమగ్ర సర్వే నిర్వహించనున్నారు.
ఈ సర్వేలో విద్యా శాఖ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లతో పాటు ఎంఆర్సీ సిబ్బంది, ఎయిడెడ్ నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినిగియోచుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
