HomeCRIMEపరీక్ష కేంద్రం వద్ద విద్యార్ధిని ఫై కత్తి పోట్లు .....పట్టపగలే ప్రేమోన్మాది ఘాతుకం

పరీక్ష కేంద్రం వద్ద విద్యార్ధిని ఫై కత్తి పోట్లు …..పట్టపగలే ప్రేమోన్మాది ఘాతుకం

పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్ధిని మీద పట్టపగలే ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన విషాద ఘటన మెదక్ పట్టణం లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్‌కు చెందిన దివ్యవాణి మెదక్ పక్కనే ఉన్న అవుసుల‌పల్లి గ్రామంలో బంధువుల వద్ద ఉంటూ డిగ్రి పరీక్షలు రాస్తోంది.. బెంగళూరు కు చెందిన చేతన్ ప్రేమ పేరుతో ఆమె ను వేధిస్తున్నాడు.

తన ప్రేమను అంగీకరించలేదన్న కోపం‌తో యువతిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న దివ్యవాణి వద్దకు వెళ్లిన చేతన్ మొదట ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను పగలగొట్టాడు.

అనంతరం తన వెంట తీసుకొవచ్చిన కత్తి‌తో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారి పోయాడు యువతి చేతికి తీవ్ర గాయం కాగా..

గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments