HomeHEALTHఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి...

ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి…

అదనపు పోలీస్ కమీషనర్ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలని అదనపు పోలీస్ కమీషనర్ కోటేశ్వర రావు పేర్కొన్నారు.ఆయన మాట్లాడుతూ..

నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ ఆదేవానుసారంగా నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెడికవర్ హస్పటల్ సౌజన్యంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ప్రత్యేకంగా ఇ.సి.జి, 2 డిఈకో, బిపి, కంటి కరీక్ష, రాండమ్ బ్లడ్ షుగర్, సి.బి.పి ( కంప్లీట్ బ్లడ్ పిక్చర్) దంత పరీక్షలు మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వి నియోగం చేసుకోవాలని, ప్రతీ సంవత్సరం ఒక్కసారైన మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించవలెనని తెలిపారు.

ఈ క్యాంప్ నేడు ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారని దీనిని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది / పోలీస్ కార్యలయం సిబ్బంది / పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది / హోమ్ గార్డ్సు మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.దాదాపు 370 మంది సిబ్బంది పరీక్షలు సద్వినియోగ పర్చుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్, బోధన్, స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పిలు, రాజా వెంకట్ రెడ్డి, పి. శ్రీనివాసులు,ఎస్. శ్రీనివాస్ రావ్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ తిరుపతి డాక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments