ఈ సందర్భంగా ఆయనకు డివిజన్ మినిస్టీరియల్ సిబ్బంది, టీఎన్జీవోస్ ఎక్సైజ్ ఫోరమ్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఇదే కార్యక్రమంలో కామారెడ్డి డీపీఈఓ గా బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డిని సైతం వారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా నూతన డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ.. శాఖా పరమైన లక్ష్యాలను చేరుకోవడంలో సిబ్బంది అందరి సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ విధుల్లో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం సిబ్బందిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ కె. అరుణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఏఏఓ నర్సయ్య, సీనియర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కలీం, సీనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, దేవేందర్, స్టాఫ్ ఆఫీసర్ ఇమ్మాన్యుయేల్‌తో పాటు రిజ్వాన్, రాజు, రాణా, నాగరాజు, సబా, ప్రియాంక, సాయిబాబా, నిశిత తదితర డివిజన్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
