నగరంలోని ఒకటవ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని మిర్చి కంపౌండ్ ప్రాంతంలో బోలోరో వాహనాంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.సంబంధిత బియ్యం ఎక్కడినుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సంబంధిత శాంపిల్ సర్వే కోసం వెళ్లినట్లు సమాచారం. ఎంత మేరకు పట్టుకున్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
