ఆర్ ఆర్ యస్ కరసేవకులు ఆదివారం నిజామాబాద్ పురవీధుల్లో కదం తొక్కారు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఐటీఐ వరకు పథ్ సంచాలన్ ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో జరిగింది.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఖాకీ ప్యాంటు, తెల్ల చోక్క, దండ ధరించి 2 వేల పైచిలుకు ఆర్ఎస్ఎస్ సేవకులతో పాల్గొన్నారు.
నగరంలోని ఖిల్లా, శంకర్ భవన్ స్కూల్, రాజీవ్ గాంధీ అడిటోరియం నుంచి శివాజీ నగర్ ప్రభుత్వ ఐటీఐ వరకు ఈ పథ్ సంచాలన్ కార్యాక్రమం జరిగిందిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని (100) ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రాంతం అంతట నాలుగు జిల్లాలు ఒకచోట కళాశాల విద్యార్థులు అందరిని కలుపుకొని వ్యక్తిత్వ వికాస్ యోజన శిబిరాలు నిర్వహించారు
అందులో భాగంగా నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ అదిలాబాద్ జిల్లాల నుండి విద్యార్థులకు నిజామాబాద్ నగరంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు శిక్షణ అనంతరంఆదివారం మధ్యాహ్నం తర్వాత మూడు పతసంచన యోజన చేయడం జరిగింది అందులో భాగంగా నగరం మూడు భాగాల నుండి కిల్లా రామాలయం నుండి పెద్ద బజారు మీద శివాజీ చౌక్ అలాగే రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి గోల హనుమాన్ మీదుగా పులాంగ్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు కళాశాల విద్యార్థులు శంకర్ భవన్ నుండి సూర్య నగర్ చంద్ర నగర్ నలంద స్కూల్ మీదుగా శివాజీ చౌక్ వరకు ఇలా మూడు సంచనలు ఒకే దగ్గర త్రివేణి సంగం లాగా శివాజీ చౌక్ లో కలుసుకొని అక్కడి నుంచి మొదలుకొని అక్కనుండి ఐటిఐ గ్రౌండ్ కు వచ్చి క సభ ప్రారంభం అయింది ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సహకారక ప్రచార ప్రభు కుమార్ మాజీ ఇంజనీర్ హనుమంతరావు అలాగే నగరంలో ప్రముఖులందరూ హాజరవుతున్నారని తెలియజేశారు
