జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులుగా చేసేందుకే పుట్టిన పార్టీ అని వెల్లడించారు. జనసేన పార్టీ నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సన్నహాకా సమావేశం ఈనెల 8వ తేదీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని కీలకంగా మారబోతున్నారన్నారు.
8 వ తేదీన తేదీన నిర్వహించబోయే సన్నాహక సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ విచ్చేస్తున్నారని కార్యకర్తలు అందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర అబ్జర్వర్ శర్మ, మీడియా ఇన్ఛార్జ్ దుంపటి శ్రీనివాస్, జిల్లా నాయకుడు గుండా సంతోష్, కోరుట్ల నాయకులు అజయ్, ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు రమేష్ బాసవేణి తదితరులు పాల్గొన్నారు.
