నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో లో స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
భారత జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జరుపుకుంటారు.భారతదేశంలో విద్యారంగానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకోవడం ద్వారా భారతదేశపు ఈ గొప్ప కుమారుడి పుట్టినరోజును స్మరించుకోవాలని నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
