Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadడీఎస్సీ లో నియమకమై… పోస్టింగ్ కోసం ప్రదక్షిణలు…

డీఎస్సీ లో నియమకమై… పోస్టింగ్ కోసం ప్రదక్షిణలు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన DSC 2024 లో గత నెలలో విడుదలైన డీఎస్సీ ఫలితాలలో నియామక పత్రం అందుకున్న ఓ అభ్యర్థిని పోస్టింగ్ కోసం డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పట్టుదలతో 2024 డీఎస్సీలో విజయం సాధించిన ఓ అభ్యర్థిని కి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ని ఖిల్లా రోడ్డులో ఉంటున్న ఊడ్తా నవత ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ లోకల్ బాడి 203 ర్యాంక్ సాధించి పోస్టుకు ఎంపికయ్యారు.

అక్టోబర్ 9న ముఖ్యమంత్రి నిర్వహించిన నియామకపత్రాన్ని తీసుకున్నట్లు ఆమె వాపోయారు రిపోర్టింగ్ కోసం అక్టోబర్ 11 డివో కార్యాలయానికి రాగా డీఎస్సీ 2002 జాబితాలను కొందరు సాంకేతిక కారణాలు అని చెప్పి తనను డిఓ కార్యాలయం చుట్టూ ఎన్ని మార్లు తిరిగిన పోస్టును ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు ఉద్యోగం లేదంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై డీఈవో అధికారిని వివరణ కోరగా స్పందించడం లేదని ఆమె వాపోయారు. బాధితురాలు సోమవారం ప్రజావాణికి వచ్చి కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం ఇచ్చాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!