Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadకలెక్టరేట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ..

కలెక్టరేట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ..

నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో లో స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని, ఆయ‌న జీవితాన్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూచించారు.

భారత జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జరుపుకుంటారు.భారతదేశంలో విద్యారంగానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకోవడం ద్వారా భారతదేశపు ఈ గొప్ప కుమారుడి పుట్టినరోజును స్మరించుకోవాలని నిర్ణయించింది.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!