Sunday, April 19, 2026
HomePOLITICAL NEWSలారీ కింద ఇరుక్కున్న యువతి సహాయ చర్యల్లో పాల్గొన్నబండి

లారీ కింద ఇరుక్కున్న యువతి సహాయ చర్యల్లో పాల్గొన్నబండి

చావు నోట్లో వరకు వెళ్లి సురక్షితంగా మహిళ ప్రాణాలతో బయటపడ్డ ఘ‌ట‌న‌ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. మానకొండూరు మండలానికి చెందిన దివ్యశ్రీ రోడ్డుపై కింద పడగా అటువైపు వెళుతున్న లారీ కింది భాగంలో చిక్కుకుంది.

అది గమనించని డ్రైవర్ లారీ అలాగే కదిలించాడు దీనితో దివ్య శ్రీ జుట్టు లారీ కింది భాగంలో చిక్కుకొని పోవడంతో లారీ కొంత దూరం ఈడ్చుకుని వెళ్ళింది.

మహిళ కేకలు వేయడంతో అప్రమత్తరమైన లారీ డ్రైవర్ వెంటనే లారీని పక్కగా ఆపాడు.అదే సమయంలో ములుగుకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రమాద ఘటన వద్ద ఆగి అటువైపు వెళుతున్న లారీల జాకీలు తెప్పించి, కత్తెరతో మహిళ జుట్టు కట్ చేయించి బయటకు తీయించారు.

గాయపడిన మహిళను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వైద్యులతో మాట్లాడి ఖర్చులు తానే భరిస్తానని బండి భరోసా ఇచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!