Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadకస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…

కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…

నవిపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులను, తరగతి గదులను,వంటగది నీ పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతిలోని విద్యార్థులతో కలసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం నుండి విద్యార్థులకు, పుస్తకాలు, దుస్తువులు ఇతర సమస్యలు తెలియజేయాలని సూచించారు.

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైణ విద్య, భోజనమందే విధంగా, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీలో ఆయనతోపాటు జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి, పదవతరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించారు.

ఈ తనిఖీలో విద్యాశాఖాధికారి అశోక్, నవిపేట్ మండల విద్యాశాఖాధికారి,ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!