నిజామాబాద్ పెద్ద పల్లి ల మధ్య నడిచే పలు రైళ్ల ను రైల్వే శాఖ రద్దు చేసింది. మంగళవారం రాత్రి పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఘజియాబాద్ కు స్టీల్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలు లోని 11 బోగీలు పట్టాలు తప్పాయి.
ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీనితో నిజామాబాద్-కాచిగూడ, గుంతకల్లు, బోధన్, కరీంనగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టాల మరమత్తులు పూర్తీ అయ్యాక రైళ్ల ను రీషెడ్యూల్ చేస్తామని స్పష్టం చేశారు
