HomePOLITICAL NEWSబిఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

బిఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వికారాబాద్ జిల్లా లగచర్ల లో కలెక్టర్ మీద దాడి ఘటనలో అరెస్టు ల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యేబిఆర్ యస్ నేత ను పోలీసులు అరెస్టు చేశారు. కేబిఆర్ పార్క్ లో బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయనను మఫ్టీ లో పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.

రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్,తో పాటు రెవెన్యూ అధికారులమీద దాడి ఘటన ను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. అదనపు డిజి మహేష్ భగవత్ రంగంలోకి ఆయనే ఈ కేసు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

దాడి వెనుక వ్యూహ రచన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి దే నని నిర్దారణ కు వచ్చిన పోలీసులు ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.దాడిలో కీలక సూత్రధారిగా ఉన్నస్థానిక బిఆర్ యస్ మండల నాయకుడు సురేశ్ ఫోన్ కాల్స్ ను పోలీసులు ట్రాక్ చేశారు సంఘటన జరిగిన రోజు సురేష్ దాదాపు 23 సార్లు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు.

అందుకే నరేందర్ రెడ్డిని నిందితుడిగా చేర్చి అతని మంగళవారం హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments