HomeTelanganaNizamabadవిద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. స్వాతి ప్రియ తల్లిదండ్రులను పరామర్శించిన -ఎన్.ఎస్.యు.ఐ నేతలు

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. స్వాతి ప్రియ తల్లిదండ్రులను పరామర్శించిన -ఎన్.ఎస్.యు.ఐ నేతలు

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలనిఅంతే తప్పా ఆత్మహత్య సమాధానం కాదని యన్ యస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు వేణురాజు అన్నారు ఆయన బాసర త్రిబుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న స్వాతి ప్రియ కుటుంబాన్ని ఎన్ ఎస్ యూ నేతలతో కలిసి పరామర్శించారు.

అనంతరం వేణురాజ్ ఇ, మీడియాతో మాట్లాడుతూ స్వాతి ప్రియ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, మీపై ఆశలు పెంచుకున్న మీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కలల్ని ఆశయాలని అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని వారికి కడుపుకోతను మిగిల్చొద్దని ఆయన అన్నారు.

స్వాతి ప్రియ ఆత్మహత్య పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనిస్వాతి ప్రియ నిజంగానే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఎవరైనా స్నేహితులు గాని బంధువులు గాని ఇతర వ్యక్తులు గాని వేధింపులకు గురి చేశారా లేకపోతే వారి తల్లిదండ్రులకు ఎవరిపైన నైనా అనుమానం ఉంటే వారందరిని విచారణ చేపిస్తామని, స్వాతి ప్రియ ఆత్మహత్యపై ఏమైనా అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో. NSUI నాయకులు సాయికిరణ్, హరీష్, శివ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments