నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని అక్టోబర్ 7-10-2024 నాడు సమాచార హక్కు చట్టం 2005, 6 సెక్షన్( i) ననుసరించి సెక్షన్ 4 (iv) ప్రకారం కొంత మంది మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను,
కొంత మంది అధికారులను మేనేజ్ చేస్తూ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ పార్టీ దృష్టి వచ్చింది తెలిపారు.ఆ విషయాన్ని నివృత్తి చేసుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి దరఖాస్తు చేసుకోని 40 రోజులు అవుతుందని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు)BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ తెలిపారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి అడిన సమాచారం ఇవ్వాలని చట్టం చెపుతుందని దండి వెంకట్ తెలిపారు.కానీ దరఖాస్తు చేసుకోని 40 రోజులైన సమాచారం ఇవ్వని సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఈవిషయంపై మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
