Wednesday, April 22, 2026
HomeEditorial Specialసూత్రధారులు సేఫ్‌.. పాత్రదారుల మీదే వేటు..!

సూత్రధారులు సేఫ్‌.. పాత్రదారుల మీదే వేటు..!

అధికార పార్టీ పెద్దల అండగా ఉన్నారంటే ఎలాంటి దందాలు చేసిన సరే ఈగ వాలదు అధికారులు సైతం వారి వైపు కన్నెత్తి చూడరు. ఎదో మొక్కుబడిగా విచారణ చేసి ఉత్తీతి చర్యలు తీసుకోవడం ఆ పై వ్యవహారం అటకెక్కించడం అలవాటే మాక్లూర్ మండలం కస్తూరి బా విద్యా సంస్థలో ఓ వివాదం లో విచారణ తంతూ అధికారులు అచ్చం ఇలాగే ముగించారు.వివాదాలకు కేంద్రంగా ఉన్న అసలు సూత్రధారులను వదిలేసి జస్ట్ పాత్రధారుల మీద బదిలీ వేటు వేసి చేతులు దులువుకున్నారు.

అధికార పార్టీ కి చెందిన ఓ మాజీ మంత్రి తెరవెనుక నడిపిన మంత్రాంగం ఫలించింది. సూత్రధారి సేఫ్ గా ఉండడం అధ్యాపక వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మాక్లూర్ మండలం లో ఏర్పాటు చేసిన కస్తూరి బాయి విద్యాలయం అనేక వివాదాల కు కేంద్రంగా నిలిచింది. అధికారులు అధ్యాపక సిబ్బంది కలిసి అనేక ఆగడాలు సాగించారు. వసూళ్ల దందాలు ఇతర అక్రమాల సంగతి ఎలా ఉన్న బాలికల్లో మూఢనమ్మకాలు మరింత పెరిగేలా టీచర్లు చేసిన నిర్వాహకులు తీవ్ర దుమారం రేపింది.

యస్ వో దగ్గర ఉండే టీచర్ విద్యార్థులకు ఆరోగ్యం బాగాలేక పొతే వారికి వైద్యులకు చూపెట్టాల్సింది పోయి సమీపం లోని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లి తయ్యత్తు కట్టించడం మంత్రగాడు ఇచ్చే నాటు వైద్యం తో సరిపట్టేది ఈ నేపథ్యంలో ఓ గొలుసు చోరీ అయింది. కాజేసింది ఎవరో తెలచడానికి సదరు టీచర్ మంత్రగాడు ని ఆశ్రయించింది ఇద్దరు విద్యార్థులను అతని వద్దకు తీసుకెళ్లి రెండు గంటల పాటు మంత్రాలు చేయించింది హల్లు పట్టించింది.

సదురు టీచర్ నిర్వాహకం తో బెంబేలెత్తిన విద్యార్థినీలు మంచం పట్టారు . దీనితో మొత్తం వ్యవహారం బయటికి పొక్కింది. విద్యార్థి సంఘాలు సైతం రంగంలోకి దిగాయి. దీనితో అధికారులు నిద్ర మత్తు వదిలి విచారణకు ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎదో పొడిచేస్తామని బిల్డప్ ఇచ్చిన విచారణ అధికారులు మొక్కుబడి విచారణ ముగించి నివేదిక ఇచ్చారు.

తీరా చర్యలు తీసుకున్నాక అందరు పెదవి విరిచారు. అసలు ఆరోగ్యం బాగాలేక పొతే విద్యార్థులను మంత్రం తో నయం చేయిస్తానంటూ హడావుడి చేసి గొలుసు చోరీ అయ్యాక విద్యార్థిని హల్లు పట్టించడానికి మంత్రగాడి వద్దకు తీసుకెళ్లిన టీచర్ ను వదిలేసి యస్ వో తో పాటు ముగ్గురు టీచర్లమీద బదిలీ వేటు వేశారు.

బీమ్ గల్ సిరికొండ కమ్మర్ పల్లి ఏర్గట్ల లకు బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నారు. అసలు వివాదాలకు ఆజ్యం పోసిన టీచర్ విషయంలో అధికారులు ఔదార్యం వెనుక ఓ మాజీ మంత్రి మంత్రాంగం నడిపారని సమాచారం. టీచర్ మీద ఈగ కూడా వాలడానికి వీలు లేదని సదురు మాజీ మంత్రి గద్దించడంతో ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడే కొనసాగించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!