రైలు నుంచి కింద పడి మహిళ మృతి చెందారు. ఈ ఘటన సిర్ణపల్లీ – ఇందల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిర్ణపల్లీ – ఇందల్వాయి రైల్వే స్టేషన్ మధ్య సుమారు 25-30 మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళ రైలు నుంచి కింద పడి తల కు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.మృతురాలి వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658591 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
