విద్యుత్ ఘతంతో యువకుడు మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.నగరంలోని ధర్మపురి హిల్స్ కు చెందిన మహమ్మద్ అయాన్ ఖాన్ (23).
ఇంట్లో కూలర్ రిపేర్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు చేతికి విద్యుత్ ఘాతం తగిలి స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు పేర్కొన్నారు.
