అమరవీరుల పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.పి.డి.ఎస్.యూ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభను నిజామాబాద్ నగరంలో బీసీ హాస్టల్ లో నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం శాస్త్రీయ విద్యావిధానం కోసం దోపిడీ లేని సమాజం కోసం ,విద్యారంగ సమస్యలపై పోరాడుతూ అనేకమంది విద్యార్థి రత్నాలు అమరవీరులయ్యారని, పీ.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం అంటేనే త్యాగాల చరిత్ర అని,వారి పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని, నిజామాబాద్ నగరంలో ఇంజనీరింగ్ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కళాశాల,ఇండోర్ స్టేడియం నిర్మించాలని అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు సాయి కిరణ్ , ప్రమోద్,రాజు, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
