HomeEditorial Specialకార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు...జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్...

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు…జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్…

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రోగులకు వైద్యాన్ని అందిస్తున్నామని ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్యులు సెలవలు అందిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పేర్కొన్నారు. ఆమె ఇది సంగతి పత్రిక చేసిన ముఖాముఖిలో మాట్లాడారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు సుమారు 2300 నుంచి 2500 మధ్య అవుట్ పేషంట్ లు వస్తున్నారని తెలిపారు.అలాగే వివిధ రకాల వైద్య అనారోగ్యం కారణంగా ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా అడ్మిట్ అవుతున్నారని తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు సుమారు 300 మందికి మోకలిచిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలు చేశామని వారు ఆరోగ్యవంతంగా డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగంలో ప్రత్యేక వైద్యులు ఉన్నారని తెలిపారు.

ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం ఒక చిన్న అమ్మాయికి సంబంధించి పారాథైరాయిడ్ గ్రంధి కి చెందిన క్యాన్సర్ సర్జరీ కూడా చేశామని, ఈ వ్యాధికి సంబంధించి ఇలాంటి అధునాతన ఆపరేషన్ చేయడం ప్రపంచలోనే ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇది 4 వ సారి, ఈ ఆపరేషన్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిందనీ తెలిపారు.

అలాగే ప్రతి విభాగంలో ప్రత్యేక వైద్యులు ఉన్నారని పేద ప్రజలకు,మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని, ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే భయాందోళనకు గురయ్యేవారు కానీ ప్రస్తుతం రోగులతో ప్రభుత్వాసుపత్రి నిండిపోతున్నాయని ఆమె తెలిపారు.

మంగళవారం కూడా నోటిలోని అంగిటి కి క్యాన్సర్ సర్జరీ కూడా చేశామని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలనుంచి వస్తున్నారని తెలిపారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్యం రోగులకు,వారితో పాటు ఒక్కరికీ మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని ఆమె తెలిపారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయనీ పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్విని చేసుకోవాలని ఆమె కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments