నిజామాబాద్ నగర మేయర్ భర్త పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఇలాంటి అరాచక చర్యలు ఆపకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో తిరగలేడని .
కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్న పోలీసుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నాం.వచ్చేది కేసీఆర్ రాజ్యమే. ఒక్కొక్కరి భరతం పడతాం. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా పోరాడాలి అని బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినమాట్లాడారు వరంగల్ లో జరిగింది విజయోత్సవ సభ కాదు, కాంగ్రెస్ విషాద సభ.
రేవంత్ రెడ్డి నోట అబద్దాల తూటాలు పేలాయి. ఆయన మాటలు విని అబద్ధమే సిగ్గుతో తలదించుకుంది అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలను కొట్టడం, కేసీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్ విజయమా? అని నిలదీశారు.
రేవంత్ అబద్దాలకు ఓరుగల్లు నివ్వెరబోయింది.అందర్నీ రోడ్లపాలు చేసిన నీచపు చరిత్ర రేవంత్ రెడ్డిది అని ఆయన పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తావు.
కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు.స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తావు అని అని ఆయన ప్రశ్నించారు.
కాగా రేవంత్ రెడ్డి పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదు మహావృక్షం. ఆ మహావృక్షం పై రేవంత్ రెడ్డి లాంటి పిట్టలు వచ్చి వాలి పోతుంటాయి. తండ్రీ కొడుకులతో ఊచలు లెక్కిస్తానని అవాకులు చెవాకులు పేలుతున్నావు. కేసీఆర్, కేటీఆర్ లు 1000/కే వీ షబ్-స్టేషన్లు.
టచ్ చేస్తే మాడి మసై పోతావు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ లో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ రెడ్డి తరం కాదు.కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ లో ఉంటూ, కేసీఆర్ కట్టించిన ప్రగతి భవన్ లో తింటూఆయన ఆనవాళ్లు చెరిపేయాలని కలలు గంటున్నావా రేవంత్? అని ఆయన మండిపడ్డారు.నువ్వు తింటున్న చేపలు, మేకలు, గొర్రెలు కేసీఆర్ పెంచినవే.
నువ్వు తిరుగుతున్న రోడ్లు కేసీఆర్ వేసినవే.కేసీఆర్ ఆనవాళ్లు చెరపడమంటే తెలంగాణ ను మళ్లీ ఆంధ్రలో కలపడమే అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లు తెలంగాణ కు నాలుగు దిక్కులు.కేసీఆర్ వెలుగునిచ్చే సూర్యుడు.
కేసీఆర్ ఫ్యామిలీ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే అవుతుంది.కేసీఆర్ తో గోక్కున్న వారెవరూ బాగుపడలేదు. గతంలో కేసీఆర్ ను ఏదో పీకుతామను గప్పాలు కొట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లు జండా పీక్కోని పోయిండ్రు.
రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. కాంగ్రెస్ సర్కారు కు పోలీసుల వత్తాసు పలుకుతున్నారు. లగచర్ల లో గిరిజన మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు.
