నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషల్ ప్రొటెక్టిన్ ఫోర్స్ డీజీపీ అనిల్ కుమార్ గురువారం సందర్శించారు.గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేటలోనీ సి టి సి కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ టీపీసీలకు పాసింగ్ అవుట్ ప్రోగ్రాం కు వెళ్ళారు.
తిరుగు ప్రయాణంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని, వార్డులు తనిఖీ చేశారు.అనంతరం ఆసుపత్రిలోని పోలీస్ భద్రతా సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఈ తనిఖీలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పాల్గొన్నారు.
