.జీవితం విరక్తితో వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని ముదిరాజ్ వీధి కి చెందిన నట్టల్ నరేష్(35).
కూలీ పనులు చేసుకుంటారు. గత 10 సంవత్సరాల క్రితం భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా,తల్లితో కలిసి ఉంటున్నారు. ఈ మేరకు తరుచూ మద్యం సేవించి తల్లితో గొడవ పడటంతో కూతురు దగ్గర ఉంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు అప్పులు ఎక్కువగా అయ్యాయి.
జీవితం పై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
