అఖండ భారతావని లో అదానీ ఓ న్యాయం ఆడబిడ్డ కు మరో న్యాయమా అంటూ ఎమ్మెల్సీ కవిత మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చాక మొదటి సారిగా ఆమె మోడీ సర్కార్ మీద విరుచుక పడ్డారు .
ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అంటూ సెటైర్లు వేశారు
