ఛత్తీస్ ఘడ్ కు సరిహద్దులో ఉండే ములుగు జిల్లా లో మావోయిస్టు నక్సల్స్ అలజడి సృష్టించారు ఓకె కుటుంబంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములను గురువారం అర్ధరాత్రి నరికి హత్య చేశారు . ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలో జరిగింది .
వాజేడు మండలం పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఊయిక రమేష్, అతని తమ్ముడు ఊయిక అర్జున్‌లు గత కొద్దీ రోజులుగా మావోయిస్టుల దళ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే నేపంతో గురువారం రాత్రి సమయంలో నిద్రిస్తుండగా మావోయిస్టులు గోడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనలో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన రమేష్‌ను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ అసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.
కాగా.. గతంలో రమేష్, అర్జున్‌లకు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టులుగతంలోనే హెచ్చరించారు ఈ విషయం పై మావోయిస్టులు వాజేడు, వెంకటాపురం ఏరియా మావోయిస్టుల కార్యదర్శి శాంత పేరుతో లేక విడుదల చేశారు.
