బిఆర్ యస్ ఆధ్వర్యంలో ఈనెల 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
2009 నవంబర్ 29 తమ అధినేత కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలపు తిరిగిందని అన్నారు. తెలంగాణఉద్యమం ఫై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసిందన్నారు.ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జీలుగా నియమించామన్నారు. కేసీఆర్ దీక్షా విరమణచేసిన రోజు డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.
దీక్షకు గుర్తుగా 29న నిమ్స్‌లో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
