ఆస్తి అమ్మడానికి నిరాకరించాడనే ఆగ్రహంతో ఏకంగా ఓ న్యాయవాది మీద తండ్రి కొడుకులు మూకుమ్మడిగా దాడి చేసి చితక బాదిన ఘటన రెండో టౌన్ స్టేషన్ పరిధి లో జరిగింది.ప్రముఖ న్యాయ వాది ఖాసీం స్థానిక ఖిల్లా రోడ్డు లో ఆఫీస్ భవనం ను తనకు అమ్మేయాలని అదే ప్రాంతానికి చెందిన ముజాఫర్ ఖాన్ ఒత్తిడి చేస్తున్నారు అయితే వృత్తి అవసరాల దృశ్యా ఆ కార్యాలయ భవనం విక్రయించడం కుదరదని ఖాసీం చెప్ప్తు వస్తున్నారు ముజఫర్ ఆదివారం మరోసారి ఇదే విషయం ఖాసీం ను అడిగాడు అయినప్పటికి అదే సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన ముజాఫర్ తన కొడుకు హర్షద్ ఖాన్ తో కలసి ఇనుప రాడ్ తో ఖాసీం మీద దాడి చేసారు బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
