HomeLaw and Orderప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరిగాయా? బోధనా తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. నర్సింగ్ కాలేజ్, స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ, ప్రధాన రహదారి నుండి కాలేజీ వరకు రోడ్డు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కంపోనెంట్ నిధులతో రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మంజూరీ లభించిన పనులను తక్షణమే ప్రారంభించాలని, వివిధ దశలలో పెండింగ్లో ఉన్న ఇతర పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ మోనికా విలాసిని తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments