బోధన్ టౌన్ పరిధిలో దొంగల ముఠా శుక్రవారం రాత్రి హల్ చల్ సృష్టించింది.బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని ఆచన్పల్లి కి చెందిన ఎల్లమ్మ ఇంటికి తాళం వేసి వెళ్ళింది.
దీంతో శుక్రవారం రాత్రి దుండగులు ఇంటి తాళం పగల గొట్టి చొరబడి బీరువా నుంచి 5 తులాల బంగారం,40 తులాల వెండి, కొంత నగదు అపహరించినాట్లు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు.
